BREAKING
బెంగళూరులో 65వ ఐసామ్ వార్షిక సదస్సు కార్తీక దీపం అంటుకుని యువతి మృతి జగన్మోహిని ఆలయంలో ప్రత్యేక పూజలు ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు హోటల్ గదిలో గుంటూరు యువకుడి అనుమానాస్పద మృతి అల్లాపల్లి పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి జయం జగదీష్ విస్తృత ప్రచారం --------- కత్తెర గుర్తుకు ఓటు వేయాలని వినతి జిల్లావ్యాప్తంగా పోలీసుల మెరుపు తనిఖీలు.. 1,019 వాహనాల తనిఖీ, రూ.1.28 లక్షల జరిమానా ఓటుకు నోటు.. గెలుపే గురి! పంచాయతీ పోరులో ధనప్రవాహంపై ఆందోళన సర్పంచి బరిలో రూ.లక్షల్లో ఖర్చుపై ప్రచారం అయ్యో పాపం... అమ్మని చూడని కవలలు! కవలలకు జన్మనిచ్చి ఐదు రోజులకే తల్లి మృతి మినుము పెసర పంట సాగుపై అవగాహనా ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన.. రుణ పరపతి దృక్పథాన్ని 'ప్రతికూలం'గా మార్చిన ఎస్‌అండ్‌పీ: దక్షిణాఫ్రికా ఆర్థిక పరిస్థితికి ఊరట.. దేశ రుణ పరపతి రేటింగ్‌ను పెంచిన ఎస్‌అండ్‌పీ: ఖేత్ బచావో అభియాన్‌తో రైతులకు అవగాహన కెనడా చమురు పైప్‌లైన్ విస్తరణకు సన్నాహాలు.. రోజుకు మరో 2.10 లక్షల బ్యారెళ్ల రవాణాకు ప్రణాళిక: గ్రామాన్ని ఆదర్శనంగా తీర్చి దిద్దుతా

హోటల్ గదిలో గుంటూరు యువకుడి అనుమానాస్పద మృతి

Select Suryaa Now
హోటల్ గదిలో గుంటూరు యువకుడి అనుమానాస్పద మృతి

ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరుకు చెందిన కోట శ్రీరామ్ (29) చౌదరిగూడలోని లివింగ్ ట్రీ ఓయూ హోటల్‌లో గది అద్దెకు తీసుకోగా, అదే గదిలో విగతజీవిగా కనిపించాడు. గుంటూరులోని ఓ ప్రైవేట్ థియేటర్‌లో కస్టమర్ కేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీరామ్‌పై థియేటర్‌కు చెందిన నగదు, మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంతో పాటు ఫోన్‌పే ద్వారా రూ.99,999 తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడని యజమాని ఆరోపించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో అతడి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది.ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 27న తన పరిస్థితిని వివరిస్తూ తల్లికి, థియేటర్ యజమానికి వీడియో సందేశం పంపిన శ్రీరామ్, తాను బస చేసిన హోటల్ లొకేషన్‌ను కూడా వారితో పంచుకున్నట్లు సమాచారం. అనంతరం హోటల్ సిబ్బంది గదిని పరిశీలించగా శ్రీరామ్ మృతి చెంది కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి యువకుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. శ్రీరామ్ మృతి వెనుక అసలు కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.