BREAKING
ఓటుకు నోటు.. గెలుపే గురి! పంచాయతీ పోరులో ధనప్రవాహంపై ఆందోళన సర్పంచి బరిలో రూ.లక్షల్లో ఖర్చుపై ప్రచారం అయ్యో పాపం... అమ్మని చూడని కవలలు! కవలలకు జన్మనిచ్చి ఐదు రోజులకే తల్లి మృతి మినుము పెసర పంట సాగుపై అవగాహనా ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన.. రుణ పరపతి దృక్పథాన్ని 'ప్రతికూలం'గా మార్చిన ఎస్‌అండ్‌పీ: దక్షిణాఫ్రికా ఆర్థిక పరిస్థితికి ఊరట.. దేశ రుణ పరపతి రేటింగ్‌ను పెంచిన ఎస్‌అండ్‌పీ: ఖేత్ బచావో అభియాన్‌తో రైతులకు అవగాహన కెనడా చమురు పైప్‌లైన్ విస్తరణకు సన్నాహాలు.. రోజుకు మరో 2.10 లక్షల బ్యారెళ్ల రవాణాకు ప్రణాళిక: గ్రామాన్ని ఆదర్శనంగా తీర్చి దిద్దుతా క్యూబా తీరంలో భారీ సరకు నౌక మునక.. ఒకరు మృతి, మరో ముగ్గురు గల్లంతు: జోహన్నెస్‌బర్గ్ నగరానికి కొత్త మేయర్.. లిబియా దిశగా రష్యా సైనిక నౌకల ప్రయాణానికి బ్రేక్.. అమెరికా సైన్యం సంచలన చర్య.. ఇరాన్ నుంచి బయలుదేరిన వాణిజ్య నౌకను క్షిపణులతో నిలిపివేత: ‘సర్పంచ్’ లఘు చిత్రం విడుదల బ్రిటన్ ఉక్కు పరిశ్రమకు యూరోపియన్ సమాఖ్య ఒప్పందంతో నష్టం..వాణిజ్య నిబంధనలు మార్చాలని డిమాండ్: అమెరికా ఔషధ సంస్థ వెర్టెక్స్ షేరుకు భారీ దెబ్బ.. కిడ్నీ ఔషధ అనుమతి వాయిదాతో 6 శాతానికి పైగా పతనం!

అయ్యో పాపం... అమ్మని చూడని కవలలు! కవలలకు జన్మనిచ్చి ఐదు రోజులకే తల్లి మృతి

Select Suryaa Now
అయ్యో పాపం... అమ్మని చూడని కవలలు! కవలలకు జన్మనిచ్చి ఐదు రోజులకే తల్లి మృతి

గణపురం, మేజర్ న్యూస్, అప్పుడే పుట్టిన బిడ్డలు అమ్మ ఒడిలో సేదతీరాల్సిన సమయంలో ఆ తల్లే శాశ్వతంగా దూరమైంది. ఎంతో ఆశగా ఎదురుచూసిన తొలి సంతానం కవలల రూపంలో జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ఆ సంతోషం ఐదు రోజులకే విషాదంగా మారింది. ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చిన తల్లి మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.గణపురం మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన మునిగాల భవాని (23), ఓంకార్ దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ దంపతులు తొలి సంతానం కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. భవాని కడుపులో కవలలు ఉన్నారని తెలియడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఐదు రోజుల క్రితం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భవాని ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. అయితే విధి వక్రీకరించి ఆ ఆనందాన్ని ఎంతోకాలం నిలవనీయలేదు. ప్రసవం జరిగిన ఐదు రోజులకే భవాని రక్తకణాలు, రక్తం గణనీయంగా తగ్గిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా భర్త ఓంకార్, బంధువులు ఎన్నో ఆశలతో అంబులెన్స్‌లో బయలుదేరారు. కానీ మార్గమధ్యంలోనే భవాని గుండె ఆగిపోవడంతో ప్రాణాలు విడిచింది. కళ్ల ముందే ఇద్దరు పసికందులు.. కాపాడుకోలేని పరిస్థితిలో భార్యను కోల్పోయిన ఓంకార్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. అమ్మ ఒడిలో పెరగాల్సిన ఆ ఇద్దరు చిన్నారులకు తల్లి ప్రేమ దూరమైంది. ఈ హృదయవిదారక ఘటనతో నగరంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రిపోర్టర్ ;ఎల్లయ్య ,గణపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా