BREAKING
కొనుగోలుదారులు లేని 41 గిగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు.. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం వెల్దుర్తి సర్పంచ్‌ అభ్యర్థి తిరివీధి రమేష్‌ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో మార్పు.. నగదు ఆదాకు ఎయిర్‌ఏషియా చర్యలు: వెల్దుర్తిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా సర్పంచి అభ్యర్థి బొమ్మన రవిరెడ్డి మండలంలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం తెదేపా మద్దతుదారులకు ఘన సన్మానం గుడిబండలో పంచాయతీ ఎన్నికల వేడి 15 సర్పంచ్ స్థానాలకు 52 మంది పోటీ బుర్రా రెడ్డి పల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఆర్ధిక లావాదేవీలపై అవగాహన సదస్సు నెహ్రు నగర్ తండా సర్పంచ్‌గా నాగరాజు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక ముంబై చా రాజా' ఈజ్ బ్యాక్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ! విజయవాడ పశ్చిమ బైపాస్‌కు తొలగిన అడ్డంకి.. మూడున్నర నెలల్లో పనులు పూర్తి! రాప్తాడులో ఘనంగా గౌరమ్మ పండుగ తిరుమల వైకుంఠ ద్వార దర్శనం: టికెట్ల విడుదల, 'ఈ-డిప్' పూర్తి షెడ్యూల్ విడుదల డీలిమిటేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు.. 2051 వరకు యథాతథం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

ఆర్ధిక లావాదేవీలపై అవగాహన సదస్సు

Select Suryaa Now
ఆర్ధిక లావాదేవీలపై అవగాహన సదస్సు


పూడూర్,మేజర్ న్యూస్:బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ భీమాను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్ఎస్ డైరెక్టర్ మానస గంగోత్రి పేర్కొన్నారు.శుక్రవారం మండల పరిధిలోని ఎంకేపల్లి గ్రామంలో సర్పంచ్ దయాకర్ ఆధ్వర్యంలో ఆర్ధిక చేరిక పరిపూర్ణ ఉద్యమంలో భాగంగా ఎస్బీఐ జనరల్ మేనేజర్ సతీష్ కుమార్,ఆర్బీఐ డిజిఎం దేవి ప్రియ,తెలంగా గ్రామీణ బ్యాంకు జీఎం కృష్ణ శర్మ లు పాల్గొని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి పౌరుడి ఆర్ధిక రక్షణ మెరుగైన భవిష్యత్తును బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం,ప్రమాద బీమా వంటి సదుపాయాలు కల్పిస్తున్నమ్మారు.ఖాతాదారులు ప్రతి ఒక్కరూ కెవైసి,ఈకెవైసి వంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పెండింగ్ లో వున్న ఖాతాదారులు రీ ఈకెవైసి చేయించుకొని తిరిగి తమ బ్యాంకు సేవలను పొందవచ్చని చెప్పారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బలమైన ఆర్ధిక రక్షణకు కృషి చేస్తున్నాయని అన్నారు.ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు పేద ప్రజలను,విద్యార్థులను వలవేసి వారి ఖాతాలో డబ్బులు జమ చేసి ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.తలిదండ్రులు తమ పిల్లల ఆధార్ కార్డు,అకౌంట్,వంటి ఇతర వివరాలను చెప్పరాదని సూచించారు.ప్రతి ఒక్కరూ భూమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జీఎం ఎస్బీఐ కన్వీనర్ సతీష్ కుమార్,తెలంగా గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ కేవీ కృష్ణ మూర్తి,గ్రామీణ బ్యాంకు ఆర్ఎం మోహన్ నాయక్,ఎఫ్ఐ మేనేజర్ కృష్ణవేణి,సిఎంఓ వెంకటయ్య,చీఫ్ మేనేజర్ బాల కృష్ణ,ఉప సర్పంచ్ విజయ్ కుమార్ నాయకులు అనంతయ్య,బండయ్య,చందర్,కుమార్ వార్డు సభ్యులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.