నెహ్రు నగర్ తండా సర్పంచ్‌గా నాగరాజు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
దుర్గి మండలం నెహ్రు నగర్ తండా గ్రామ సర్పంచ్‌గా నాగరాజు నాయక్, ఉపసర్పంచ్‌గా రవీంద్ర నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఎలాంటి పోటీ లేకుండా ఇరువురు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామస్థులు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నాగరాజు నాయక్, ఉపసర్పంచ్ రవీంద్ర నాయక్‌లకు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.పేర్ల వెంకటేశ్వర్లు దుర్గి సినియర్ రిపోర్టర్