BREAKING
విజయవాడ పశ్చిమ బైపాస్‌కు తొలగిన అడ్డంకి.. మూడున్నర నెలల్లో పనులు పూర్తి! రాప్తాడులో ఘనంగా గౌరమ్మ పండుగ తిరుమల వైకుంఠ ద్వార దర్శనం: టికెట్ల విడుదల, 'ఈ-డిప్' పూర్తి షెడ్యూల్ విడుదల డీలిమిటేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు.. 2051 వరకు యథాతథం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి విజయవాడలో కాస్మో వాహన రక్షణ సేవల విస్తరణ పటమట నారాయణ ఈ-చాంప్స్‌లో ఎన్‌పీఎల్ ఫైనల్స్ భక్త కనకదాస జీవితం ఆదర్శనీయం: కలెక్టర్ తోట్లవల్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ కృష్ణా జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ రెండో దశ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రచారం పెద్దపులిపాకలో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం సీసీ కెమెరాలతో 30 నిమిషాల్లో ఆటో గుర్తింపు.. పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత

రాప్తాడులో ఘనంగా గౌరమ్మ పండుగ

Select Suryaa Now
రాప్తాడులో ఘనంగా గౌరమ్మ పండుగ

రాప్తాడులో ఘనంగా గౌరమ్మ పండుగ

భక్తిశ్రద్ధలతో జ్యోతుల ఊరేగింపు.. సంప్రదాయ దుస్తుల్లో అలరించిన చిన్నారులు

రాప్తాడు మేజర్ న్యూస్:

రాప్తాడులో గౌరమ్మ పండుగను పురస్కరించుకొని శుక్రవారం జ్యోతుల ఊరేగింపును భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక నీలకంఠేశ్వర స్వామి ఆలయం, పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రాంతం, చౌడమ్మ కట్ట, డ్రామా కట్ట వద్ద నుంచి చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి గౌరమ్మ బిడ్డలుగా ముస్తాబయ్యారు.

చిన్నారులు జ్యోతులు చేతబట్టి భక్తిపాటల నడుమ ఊరేగింపుగా బయలుదేరి స్థానిక రామేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కట్ల గౌరమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

చిన్నారులు ప్రత్యేక అలంకరణతో సంప్రదాయ దుస్తుల్లో జ్యోతులు చేతబట్టి ఊరేగింపులో పాల్గొనడం పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో గౌరమ్మ బిడ్డలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.