BREAKING
అమెరికా మార్కెట్లకు పుంజుకునే సంకేతాలు.. నాస్‌డాక్ వాయిదాలు 2.47 శాతం లాభంలో: ఏఐ, చిప్ షేర్లలో మళ్లీ కొనుగోళ్ల జోరు! స్విస్ రక్షణ వ్యవస్థ కొనుగోలుపై ఫ్రాన్స్ ఆసక్తి.. సంయుక్త తయారీ, సాంకేతిక సహకారానికి ప్రతిపాదన: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. నవంబర్ 28న హైదరాబాద్, విజయవాడల్లో తులం ఎంతంటే కొనుగోలుదారులు లేని 41 గిగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు.. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం వెల్దుర్తి సర్పంచ్‌ అభ్యర్థి తిరివీధి రమేష్‌ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో మార్పు.. నగదు ఆదాకు ఎయిర్‌ఏషియా చర్యలు: వెల్దుర్తిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా సర్పంచి అభ్యర్థి బొమ్మన రవిరెడ్డి మండలంలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం తెదేపా మద్దతుదారులకు ఘన సన్మానం గుడిబండలో పంచాయతీ ఎన్నికల వేడి 15 సర్పంచ్ స్థానాలకు 52 మంది పోటీ బుర్రా రెడ్డి పల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఆర్ధిక లావాదేవీలపై అవగాహన సదస్సు నెహ్రు నగర్ తండా సర్పంచ్‌గా నాగరాజు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక ముంబై చా రాజా' ఈజ్ బ్యాక్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ! విజయవాడ పశ్చిమ బైపాస్‌కు తొలగిన అడ్డంకి.. మూడున్నర నెలల్లో పనులు పూర్తి! రాప్తాడులో ఘనంగా గౌరమ్మ పండుగ

గుడిబండలో పంచాయతీ ఎన్నికల వేడి 15 సర్పంచ్ స్థానాలకు 52 మంది పోటీ

Select Suryaa Now
గుడిబండలో పంచాయతీ ఎన్నికల వేడి 15 సర్పంచ్ స్థానాలకు 52 మంది పోటీ

గుడిబండలో పంచాయతీ ఎన్నికల వేడి 15 సర్పంచ్ స్థానాలకు 52 మంది పోటీ

174 వార్డులకు 381 మంది బరిలో

కరికెర సర్పంచ్ ఏకగ్రీవం

రాళ్లపల్లిలో నాలుగు వార్డులు ఏకగ్రీవం

గుడిబండ, మందలపల్లిలో హోరాహోరీ పోరు

గుడిబండ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు రసవత్త రంగా మారింది. మండలంలోని 16 గ్రామ పంచా యతీల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి తుది అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఎంపీడీవో పి. కేశవరెడ్డి వెల్లడిం చిన వివరాల ప్రకారం మండలవ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 433 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సర్పంచ్ స్థానాలకు సంబంధించి మొత్తం 16 స్థానాలు నోటి ఫై చేయగా, కరికెర గ్రామ పంచాయతీలో సన్నప్ప చిట్టయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగి లిన 15 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 15 స్థానాలకు సంబంధించి మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుడిబండ, మందలపల్లి గ్రామ పంచాయతీల్లో అత్యధికంగా ఏడుగురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉండగా, చిగతుర్పి, దేవరహట్టి, ముతు కూరు, తాలికెర పంచాయతీల్లో నలుగురు చొప్పున పోటీ పడుతున్నారు. కొంకల్లు, మరుబాగల్, రాళ్ల పల్లి, శంకరగల్లు పంచాయతీల్లో ముగ్గురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. చిన్న చోళగిరి, గునె మొరుబాగల్, జంబులబండ, కుంబారనాగేపల్లి, ఎస్. రాయాపురం పంచాయతీల్లో ఇద్దరు చొప్పున అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది.

వార్డుల్లో 381 మంది పోటీ
మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధి లో మొత్తం 178 వార్డు సభ్యుల స్థానాలు నోటిఫై అయ్యాయి. వీటిలో రాళ్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 174 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 381 మంది అభ్యర్థులు వార్డు సభ్యులుగా పోటీ పడుతున్నారు. మందలపల్లి గ్రామ పంచాయతీలో కేవలం 10 వార్డు స్థానాలకు ఏకంగా 39 మంది అభ్యర్థులు పోటీలో ఉండటం విశేషం. గుడిబండలో 30 మంది, కరికెరలో 30 మంది, జంబులబండలో 26 మంది, ముతుకూరులో 25 మంది, దేవరహట్టి, మరుబాగల్ లో 24 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. తాలికెరలో 27 మంది, చిగతు ర్పిలో 19 మంది, రాళ్లపల్లిలో 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగిలిన పంచాయతీల్లో కూడా వార్డు సభ్యుల స్థానాలకు పోటీ నెలకొంది.

ఐదు స్థానాలు ఏకగ్రీవం
మండలంలో మొత్తం ఐదు స్థానాలు ఏకగ్రీవ మయ్యాయి. ఇందులో కరికెర గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సన్నప్ప చిట్టయ్య ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. అదేవిధంగా రాళ్లపల్లి గ్రామ పంచా యతీ లో నాలుగు వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవము య్యాయి. ఆరో వార్డులో ఎన్. రూప, పదో వార్డులో హనుమంతరాయప్ప, 11వ వార్డులో శ్రీనివాసులు, 12వ వార్డులో చిట్టప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తంగా గుడిబండ మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలవడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రధాన పార్టీల మద్దకుతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉండటంతో గ్రామాల్లో ఎన్ని కల ప్రచారం ఊపందుకుంది. రానున్న పోలింగ్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

గుడిబండ రిపోర్టర్ దేవరాజు