ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి తిరివీధి రమేష్
వెల్దుర్తి, మేజర్ న్యూస్: ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి తిరివీధి రమేష్ పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దల నుంచి సంక్రమించిన వ్యాపారాలు ఉన్నాయని, తనకు వ్యక్తిగత సంపాదన అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే ముందడుగు వేసి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. ఎన్నికల సంఘం తనకు 'మంచం' గుర్తు కేటాయించిందని, డిసెంబర్ 2న జరగనున్న ఎన్నికల్లో తనను బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు డాక్టర్ తిరివీధి రాంప్రసాద్, తిరివీధి సుధీంద్ర, అత్తులూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.