వెల్దుర్తిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా సర్పంచి అభ్యర్థి బొమ్మన రవిరెడ్డి
వెల్దుర్తి, మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వెల్దుర్తిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని వైకాపా మండల కన్వీనర్, వెల్దుర్తి సర్పంచి అభ్యర్థి బొమ్మన రవిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక స్వగృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి సహకారంతో పట్టణంలో ఏళ్ల నాటి తాగునీటి సమస్యను పరిష్కరించామని, మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. అమలు కాని హామీలు ఇవ్వలేనని, తాను చేసిన పనులను చూసి ఆదరించాలని కోరారు. ఎన్నికల్లో తనకు 'క్యారెట్' గుర్తు కేటాయించారని తెలిపారు. 16 వార్డుల్లో పోటీ చేస్తున్న తమ బలపరిచిన అభ్యర్థులను సైతం గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, రఘురెడ్డి, ఆరిఫ్, చక్రపాణిరెడ్డి, నాగిరెడ్డి, దేవరాజు, డేవిడ్, సతీష్, రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.