BREAKING
దేశ కథా సంప్రదాయాలు, భారతీయ సినిమా వైభవంపై ప్రత్యేక చర్చ ప్రతిష్టాత్మక ఐటీయూ ప్లెనిపొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2030కు భారత్ ఆతిథ్యం వారణాసిలో నేడు కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభోత్సవం మాటలు చెప్పడానికి కాదు.. అభివృద్ధి చేసి చూపించడానికి వచ్చా: ప్రవీణ్ రెడ్డి! కోడిగేనహళ్లిని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే నాలక్ష్యం.. పదవి కోసం కాదు.. పుట్టి పెరిగిన గడ్డకు సేవ చేయడానికే పోటీ.. శనివారం సుబ్బరాయునిపల్లి కాలువపల్లిలో విస్తృత ప్రచారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిజోరం, నాగాలాండ్ పర్యటన తిరుప్పరంగున్రం దీపం వివాదం వేళ మురుగన్ భక్తి నినాదం పంచుకున్న ప్రధాని మోదీ ఉక్రెయిన్ శాంతి, ఇండో-పసిఫిక్ భద్రత, ఉగ్రవాదంపై భారత్-ఈయూ ఉమ్మడి నిబద్ధత బిమ్‌స్టెక్ అండర్-23 అథ్లెటిక్స్ 2026లో భారత్ అగ్రస్థానం ఐఐటీఎఫ్ 2026లో సీబీఐసీ జీఎస్టీ అండ్ కస్టమ్స్ పెవిలియన్‌కు కాంస్య పతకం బెంగళూరులో 65వ ఐసామ్ వార్షిక సదస్సు కార్తీక దీపం అంటుకుని యువతి మృతి జగన్మోహిని ఆలయంలో ప్రత్యేక పూజలు ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు హోటల్ గదిలో గుంటూరు యువకుడి అనుమానాస్పద మృతి అల్లాపల్లి పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి జయం జగదీష్ విస్తృత ప్రచారం --------- కత్తెర గుర్తుకు ఓటు వేయాలని వినతి

ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

Select Suryaa Now
ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

అమరావతి, నవంబరు 28: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడనుంది.

ముఖ్యంగా నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్కాపురంతో పాటు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడనున్నాయి. వీటితో పాటు మిగతా రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.