సాని వారి పల్లి సర్పంచ్ గా శ్రీనివాసులు విజయం
మండల పరిధిలోని సానే వారి పల్లి పంచాయతీ సర్పంచ్ గా టి శ్రీనివాసులు 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో వీరి కుటుంబీకులు సర్పంచ్ గా విధులు నిర్వర్తించారు. సర్పంచ్ గా ఎంపికైన శ్రీనివాసులు పలువురు అభినందించారు. అందరి సహకారంతో పంచాయితీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.