నేడు మూడో రోజు కిషన్ రెడ్డి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర
హైదరాబాద్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేపట్టిన 'నషా ముక్త్ భారత్' (మత్తు పదార్థాల రహిత భారత్) పాదయాత్ర నేడు మూడో రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్ వద్ద ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది.
అక్కడి నుంచి మైత్రీవనం చౌరస్తా, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ మీదుగా జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా అక్కడ 'నషా ముక్త్ భారత్' కోసం ప్రత్యేకంగా సంకల్ప సభను నిర్వహించనున్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువతలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.