కరీంనగర్‌లో అక్షర–అలెన్ జేఈఈ, నీట్ కోచింగ్ ప్రారంభం
సూర్య కరీంనగర్: జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు గత 38 సంవత్సరాలుగా శిక్షణ అందిస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ తాజాగా కరీంనగర్‌లో అడుగుపెట్టింది. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌తో కలిసి 2027–28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (11వ తరగతి)తో పాటు జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ సరస్వతి కల్పక్ మాట్లాడుతూ.. అలెన్ వంటి ప్రముఖ సంస్థ కరీంనగర్‌లోనే కోచింగ్ ప్రారంభించడం స్థానిక విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ఇకపై జేఈఈ, నీట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన శిక్షణను అందుబాటు ఫీజులతో ఇక్కడే పొందవచ్చని తెలిపారు. నేటి నుంచి ప్రతిరోజూ కెరీర్ గైడెన్స్ కౌన్సెలింగ్‌తో పాటు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్షర–అలెన్ విద్యాసంస్థలో చేర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.