BREAKING
కుందుర్పి మండలం ఎనుములతోటిలో పోలీసులపై దాడి. నేరణికి సర్పంచ్ గా గెలిచిన రాంపురం బసమ్మ అభినందనలు ఓటమితో అధైర్య పడవద్దు.. కార్యకర్తలకు అండగా ఉంటా. తలారి రంగయ్య. హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం కంబదూర్ లో కూటమి విజయకేతనం కళ్యాణదుర్గం మండలంలో టిడిపి విజయకేతం. కేజిబివి పి ఈ టీ విధుల నుంచి తొలగింపు.... ముదిగుబ్బ టిడిపి కైవసం నేడు గణాధిప సంకష్ట చతుర్థి.. శుభ ముహూర్తం..పూజా విధానం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయాలు ఇవే! ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ బాడంగి మండలంలో టీడీపీ హవా25 పంచాయతీలకు ఎన్నికలు.. 18 చోట్ల టీడీపీ, 6 చోట్ల వైకాపా విజయం అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్, మెజార్టీ సర్పంచ్ స్థానాలు వైసిపి మద్దతుదారులు గెలుపు రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు నౌకలు గనులను ఢీకొన్నాయన్న ఇరాన్ ప్రకటన..

ఓటమితో అధైర్య పడవద్దు.. కార్యకర్తలకు అండగా ఉంటా. తలారి రంగయ్య.

Select Suryaa Now
ఓటమితో అధైర్య పడవద్దు.. కార్యకర్తలకు అండగా ఉంటా. తలారి రంగయ్య.

కళ్యాణదుర్గం: నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలు తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అదే సమయంలో ఎన్నికల బరిలో నిలిచి పార్టీ కోసం కష్టపడి పోరాడినప్పటికీ ఓటమి పాలైన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను ఆత్మవిశ్వాసంతో స్వీకరించాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపు సాధించలేకపోయినప్పటికీ పార్టీ కోసం కార్యకర్తలు చేసిన కృషి, ప్రజల మధ్య సాగించిన పోరాటం ఎంతో విలువైనవని పేర్కొన్నారు. కష్టకాలంలో కార్యకర్తలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం ఎదురైనా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. విజయం సాధించిన అభ్యర్థులతో పాటు ఎన్నికల్లో పోరాడి ఓటమి పాలైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వ్యక్తిగతంగా తాను అండగా ఉంటానని తలారి రంగయ్య స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురికాకుండా ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. 'మీ వెంటే నేను.. నా వెంటే మీరు' అనే ఆత్మీయ భావనతో నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎన్నికల ఫలితాలకు అతీతంగా ప్రజలతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి