BREAKING
కౌంటింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. ఎన్నికల అధికారికి కుడి చేయి విరగడంతో కలకలం. రామగిరి సర్పంచిగా బెస్త ఆదిలక్ష్మి ఘనవిజయం కరీంనగర్‌లో అక్షర–అలెన్ జేఈఈ, నీట్ కోచింగ్ ప్రారంభం మార్లమడికి గ్రామ సర్పంచ్ రాలిగా లక్ష్మి అభినందనలు శ్రీవారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ పెద్ద గోనెహాలు గ్రామ సర్పంచ్ రాలిగా గెలిచిన రెడ్డి గారి లక్ష్మి అభినందనలు కుందుర్పి మండలం ఎనుములతోటిలో పోలీసులపై దాడి. నేరణికి సర్పంచ్ గా గెలిచిన రాంపురం బసమ్మ అభినందనలు ఓటమితో అధైర్య పడవద్దు.. కార్యకర్తలకు అండగా ఉంటా. తలారి రంగయ్య. హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం కంబదూర్ లో కూటమి విజయకేతనం కళ్యాణదుర్గం మండలంలో టిడిపి విజయకేతం. కేజిబివి పి ఈ టీ విధుల నుంచి తొలగింపు.... ముదిగుబ్బ టిడిపి కైవసం నేడు గణాధిప సంకష్ట చతుర్థి.. శుభ ముహూర్తం..పూజా విధానం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయాలు ఇవే!

శ్రీవారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ

Select Suryaa Now
శ్రీవారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ

శ్రీవారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భారీ విలువైన బంగారు ఆభరణాలను భక్తులు సమర్పించారు. చెన్నైకి చెందిన దాతలు శ్రీ వర్ధమాన్ జైన్, శ్రీమతి రాధిక జైన్ దంపతులు మొత్తం 121 కిలోల బరువుతో, రూ.207.6 కోట్ల విలువైన 46 రకాల బంగారు ఆభరణాలను శ్రీవారికి కానుకగా అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఆభరణాలను సమర్పించారు.

ఈ కానుకలో స్వామివారి అలంకరణకు సంబంధించిన పలు విశేష ఆభరణాలు ఉన్నాయి. పాద కవచాలు, అందెలు, పాగడా, తులసిపత్ర హారం, అష్టోత్తర శత కాసుల మాల, చతుర్భుజ లక్ష్మీ హారం, పులిగోరు, అశ్వత్థ పత్ర హారం, సాదా వడ్డాణం, గంటల మొలత్రాడు, సూర్య కఠారి, కౌస్తుభం, శ్రీవత్సం తదితర ఆభరణాలను దాతలు సమర్పించారు.

అలాగే మోచేయి, కటి హస్తంపై రేకు, నాగాభరణ వడ్డాణం, గోపు, ఐదు పేటల కంఠెలు, చంద్రవంకీ కంఠి, వైకుంఠ హస్తం, కటి హస్తం, నాగాభరణ కడియాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, కర్ణ పత్రములు, బావులీలు కూడా ఈ కానుకలో ఉన్నాయి.

శాలిగ్రామ హారాలు, కమలం తరహా శాలిగ్రామ హారాలు, శీమ కమలముల మోపుగల యజ్ఞోపవీతం, శంఖ కవచం, చక్ర కవచం, ముఖపట్టి, కిరీటం వంటి విశేష ఆభరణాలను సైతం సమర్పించారు.

భక్తితో, మహాదాతృత్వంతో శ్రీవారికి ఇంత విలువైన ఆభరణాలను సమర్పించిన జైన్ దంపతుల కానుక భక్తులలో విశేషంగా చర్చనీయాంశమైంది.

1.పాద కవచములు – 2 
2. అందెలు – 2 
3. పాగడా – 1 
4. తులసిపత్ర హారము – 1 
5. అష్టోత్తర శత కాసుల మాల – 1 
6. చతుర్భుజ లక్ష్మీ హారము – 1 
7. పులిగోరు – 1 
8. అశ్వత్థ పత్ర హారము – 1 
9. సాదా వడ్డాణము – 1 
10. గంటల మొలత్రాడు – 1 
11. సూర్య కఠారి – 1 
12. కౌస్తుభం – 1 
13. శ్రీవత్సం – 1 
14. మోచేయి – 1 
15. కటి హస్తము పై రేకు – 1 
16. నాగాభరణ వడ్డాణము – 1 
17. గోపు – 1 
18. ఐదు పేటల కంఠెలు – 5 
19. చంద్రవంకీ కంఠి – 1 
20. వైకుంఠ హస్తము – 1 
21. కటి హస్తము – 1 
22. నాగాభరణ కడియములు – 2 
23. నాగాభరణములు – 2 
24. భుజకీర్తులు – 2 
25. కర్ణ పత్రములు – 2 
26. బావులీలు – 2 
27. శాలిగ్రామ హారము – 2 (02 Parts) 
28. కమలం తరహా శాలిగ్రామ హారములు – 2 (02 Parts) 29. శీమ కమలముల మోపుగల యజ్ఞోపవీతం – 1 
30. శంఖము కవచము – 1 
31. చక్రము కవచము – 1 
32. ముఖపట్టి – 1 
33. కిరీటము – 1