ఫోక్సో కేసులో నిందితుడికి సంవత్సరం జైలు శిక్ష.
జల్ పల్లి మేజర్ న్యూస్ : షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుడికి ఫోక్సో చట్టం కింద, ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం, సంవత్సరం జైలు శిక్షతోపాటు 2వేల జరిమానా, బాధితులకు 50వేలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెల్లడించింది. పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, జల్ పల్లి గ్రామం, శ్రీరామ కాలనీ రామ మందిరం సమీపంలో ఉంటున్న బూసగళ్ల పృథ్వి(21) విద్యార్థి, 2025లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం నిందితుడికి సంవత్సరం జైలు శిక్షతోపాటు, రెండు వేల జరిమానా, బాధిత కుటుంబానికి 50వేలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు. నేరం చేసిన వారు ఎంతవారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, కఠిన శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.