భాగ్యనగరానికి వాన ఊరట
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చాలా రోజులుగా వర్షం జాడ లేక అల్లాడిపోతున్న భాగ్యనగరం తాజా వానతో పులకించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం దంచికొట్టింది.
భారీ వర్షం కారణంగా పలు కాలనీల్లోని రోడ్లపై వరద నీరు ప్రవహించింది. ఇటీవలి కాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి, తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం నగరవాసులకు ఎంతో ఉపశమనం కలిగించింది.