BREAKING
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీ భాగ్యనగరానికి వాన ఊరట 2026-27 సహకార రోడ్‌మ్యాప్‌కు సభ్య దేశాల ఆమోదం ఫలించిన గుకేశ్ వ్యూహం.. మూడో గేమ్ డ్రా ఫోక్సో కేసులో నిందితుడికి సంవత్సరం జైలు శిక్ష. తీవ్ర ఒడిదుడుకుల తర్వాత నిలదొక్కుకుంటున్న ఆసియా షేర్లు ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆదర్శ కుటుంబం’: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా కేంద్ర బడ్జెట్ 2027-28 రూపకల్పనకు ముందస్తు సంప్రదింపులు పూర్తి ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలు రూ.127 లక్షల కోట్లకు చేరిక కమర్షియల్ లెక్కలు లేకుండా చేసిన సినిమా: ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లాంచ్‌లో నితిన్ భావోద్వేగ ప్రసంగం పాక్ సిరీస్‌పై సినీ కార్మిక సంఘం అల్టిమేటం: ఆ సిరీస్ ఆపకపోతే నెట్‌ఫ్లిక్స్ షూటింగ్‌లు బంద్ చేస్తామని హెచ్చరిక 14వ జేడీసీసీ సమావేశంలో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన భారత్, యూఏఈ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు కేరళ, మిజోరం, నాగాలాండ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఐఓఆర్ఏ మంత్రివర్గ సమావేశానికి ముందు శ్రీలంక జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ: సభ్యుడిగా అల్లు అరవింద్ నియామకం

ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆదర్శ కుటుంబం’: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా

Select Suryaa Now
ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆదర్శ కుటుంబం’: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ చిత్రం ఓటీటీ వేదికపై సందడి చేస్తోంది. నవంబర్ 27 నుంచి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రసారం ప్రారంభమైంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రావడంతో డిజిటల్ వేదికపై విస్తృత ప్రేక్షకులకు చేరువవుతోంది.

గతంలో పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేశ్‌తో కలిసి పూర్తిస్థాయి దర్శకుడిగా రూపొందించిన తొలి చిత్రం ఇది. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా, నివేదా పేతురాజ్, నారా రోహిత్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, యువీనా పార్థవి, రాజా ప్రజ్వల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.

కథాంశం విషయానికి వస్తే, ఒక మధ్యతరగతి కుటుంబానికి వంద కోట్ల రూపాయల లాటరీ తగలడంతో వారి జీవితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ లాటరీ సొమ్ము కోసం ఓ ముఠా ఇంటిలోకి చొరబడటం, ఆ క్రమంలో ఎదురయ్యే ఉత్కంఠభరిత మలుపులు, చిట్టిబాబు నేపథ్యం చుట్టూ కథనం సాగుతుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఫలితాన్ని అందుకోలేకపోయినప్పటికీ, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ అంశాలతో కూడిన ఈ చిత్రానికి ఓటీటీ వేదికగా ఎలాంటి ఆదరణ లభిస్తుందోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.