BREAKING
గేదెల్లంక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన నాయకులు గుద్దటి జమ్మి గారి సతీమణి శ్రీమతి కాశీ తులసి రత్నం ఘన విజయం థియేటర్లలో శర్వానంద్ ‘భోగి’: సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందంటే? నాన్న కుట్టి మూవీ రివ్యూ: విజయ్ ఆంటోని ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఎలా మెప్పించిందంటే? పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? సూపర్ మార్కెట్ షాపింగ్ ఇక మీ చేతిలోనే.. తెలుగు రాష్ట్రాల్లో ‘సేల్స్ బీజ్’ యాప్ మరియు టెర్రాన్ ఈవీ స్కూటర్ల ప్రారంభం యథార్థ సంఘటనల ఆధారంగా ‘కూల్ రాఖీ కూల్’: ఘనంగా పోస్టర్, టైటిల్ లాంచ్ ఈవెంట్ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’: సక్సెస్ మీట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్న చిత్ర బృందం స్ఫూర్తి.. (కథ) కౌంటింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. ఎన్నికల అధికారికి కుడి చేయి విరగడంతో కలకలం. రామగిరి సర్పంచిగా బెస్త ఆదిలక్ష్మి ఘనవిజయం కరీంనగర్‌లో అక్షర–అలెన్ జేఈఈ, నీట్ కోచింగ్ ప్రారంభం మార్లమడికి గ్రామ సర్పంచ్ రాలిగా లక్ష్మి అభినందనలు శ్రీవారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ పెద్ద గోనెహాలు గ్రామ సర్పంచ్ రాలిగా గెలిచిన రెడ్డి గారి లక్ష్మి అభినందనలు కుందుర్పి మండలం ఎనుములతోటిలో పోలీసులపై దాడి.

యథార్థ సంఘటనల ఆధారంగా ‘కూల్ రాఖీ కూల్’: ఘనంగా పోస్టర్, టైటిల్ లాంచ్ ఈవెంట్

Select Suryaa Now
యథార్థ సంఘటనల ఆధారంగా ‘కూల్ రాఖీ కూల్’: ఘనంగా పోస్టర్, టైటిల్ లాంచ్ ఈవెంట్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఇంక్ స్పైర్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కూల్ రాఖీ కూల్’ చిత్రం పోస్టర్లు, టైటిల్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహ్మద్ సాయిద్ సమి హీరోగా నటిస్తూనే రచన, ఎడిటింగ్, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమా యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ వేడుకకు హాజరైన అతిథులు మాట్లాడుతూ, ఒకే వ్యక్తి హీరోగా, దర్శకుడిగా, రచయితగా, ఎడిటర్‌గా ఇన్ని విభాగాలను సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. చిన్నప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్న సమి, కుటుంబ ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం విశేషమని, యువ ప్రతిభను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయని, చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రం తన నిజ జీవితం, స్నేహితుల అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకుందని మహ్మద్ సాయిద్ సమి తెలిపారు. కర్నూలు నేపథ్యంలో స్థానిక యాస, స్లాంగ్‌తో సహజత్వానికి దగ్గరగా సినిమాను తెరకెక్కించామని చెప్పారు. బెంగళూరుకు చెందిన కన్నడ అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నామని, ఆమె ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుని నటించారని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర నిర్మాత, సమి తల్లి ఎస్ ఖుస్నుమ మాట్లాడుతూ, తన కుమారుడు షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా చూపిన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా నిర్మించానని చెప్పారు. లాభనష్టాల గురించి ఆలోచించకుండా, తన కొడుకు ఒక స్థాయిలో నిలబడాలనే ఆశయంతో ముందుకు వచ్చానని, సినిమా అందరికీ చేరువై మంచి విజయం సాధించాలని ఆశీర్వదించారు.

సినిమా విశేషాలపై సమి స్పందిస్తూ, ప్రస్తుత సమాజంలోని యువత రిలేషన్‌షిప్స్, ప్రేమకథలు, ఘోస్టింగ్ వంటి వాస్తవ అంశాలను ఇందులో చూపించామని, అందుకే యూత్‌కు వంద శాతం కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. ఇది నిజమైన కథ కావడంతో ఆ భావోద్వేగాలను తానే సరిగ్గా పండించగలననే ఉద్దేశంతో ఎవరినీ సంప్రదించకుండా స్వయంగా నటించానని వివరించారు. సినిమాలో అసభ్య సన్నివేశాలు ఏమీ లేవని, కేవలం సహజమైన భావోద్వేగాలను వ్యక్తపరిచే క్రమంలో జెన్‌జీ తరం మాట్లాడుకునే పచ్చి సంభాషణలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. దుబాయ్ సీను చిత్రంలో బ్రహ్మానందం చెప్పిన పాపులర్ మీమ్ డైలాగ్ ప్రేరణతో, సినిమాలో రాకీ అనే పాత్ర ఎక్కువగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు స్నేహితులు ‘కూల్ రాఖీ కూల్’ అని సర్దిచెప్పే సందర్భం నుంచి ఈ టైటిల్ పుట్టిందని వెల్లడించారు.

డార్క్ కామెడీ అంశాలతో పాటు భావోద్వేగభరిత మలుపులతో, స్నేహం మరియు ప్రేమకథలను సమాంతరంగా ఈ చిత్రంలో ఆవిష్కరించినట్లు చిత్ర బృందం పేర్కొంది. పూర్తిగా కొత్త నటీనటులు, సమి స్నేహితుల బృందంతో సహజమైన వాతావరణంలో ఈ సినిమాను రూపొందించారు. విభిన్నమైన టైటిల్, కర్నూలు నేపథ్యం, యువతను ఆకట్టుకునే వాస్తవిక కథాంశంతో వస్తున్న ‘కూల్ రాఖీ కూల్’ చిత్రం సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.