BREAKING
ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు తేజాపూర్, ​శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆర్టీసీ బస్ భవన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్.. శ్రీలంకపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, దూకుడుగా ఆడిన ఓపెనర్లు! ఇందిరమ్మ బీమా పతకాన్ని సద్వినియోగం చేసుకోవాలి వైస్ చైర్ పర్సన్ మిట్టపెల్లి సరిత - శ్రీనివాస్ ఇంటి దారినీ మూసేస్తారా? హైడ్రా, ట్రాఫిక్ పోలీసులపై పోలీస్ కమిషనర్‌కు ఏడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు అద్భుత స్పిన్నర్ కుల్దీప్‌ను అందుకే ఇండియాకు పంపేశారు.. కివీస్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు! సైబరాబాద్‌ రవాణా వ్యవస్థకు కొత్త దిశ.. రెండో టెస్ట్ తుది జట్టులో ఆ ఇద్దరిని తప్పించాలి.. సిరాజ్, జడేజాలను తీసుకోవాలన్న ఆకాశ్ చోప్రా! భక్తి భావంతో మార్మోగిన రాజాపురం.. క్రైస్ట్‌చర్చ్ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ విధ్వంసం.. 21 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్! ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై గీతంలో శిక్షణ

బ్రిలియంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘బాల 369’ పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ!

Select Suryaa Now
బ్రిలియంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘బాల 369’ పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: జయమ్మ పంచాయతీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం బాల 369. అటజని కంచె అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమాలో అర్విన్ తేజ్ కథానాయకుడిగా నటించారు. అర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు వైవా హర్ష సమర్పిస్తున్నారు. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్రబృందం ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ, స్వతహాగా కష్టపడి ఎదిగిన నటుడు వైవా హర్ష ఈ సినిమాతో సమర్పకుడిగా మారడం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హీరో అర్విన్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని, ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు విజయ్ కుమార్ ఈ రెండో చిత్రంతో కచ్చితంగా పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంటారని నిఖిల్ ధీమా వ్యక్తం చేశారు. పరిమిత బడ్జెట్‌లో ఏకంగా 15 దేశాల్లో ఈ సినిమాను చిత్రీకరించడం సాధారణ విషయం కాదని, థియేటర్లలో కూర్చుని ఒక ప్రపంచ యాత్ర చేసిన అనుభూతిని పొందాలంటే ప్రేక్షకులు తప్పకుండా బాల 369 చూడాలని, ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు మాట్లాడుతూ, అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలోని అటజని కాంచే పద్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను రాశానని, ఈ చిత్రాన్ని తెలుగు ఉపాధ్యాయులందరికీ అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. 15 దేశాల్లో షూటింగ్ చేయడం ఎన్నో కొత్త అనుభవాలను ఇచ్చిందని, కశ్మీర్ షెడ్యూల్ సమయంలో నకిలీ తుపాకుల విషయంలో ఎయిర్‌పోర్టులో పోలీసులు, ఆర్మీ అధికారులు గంటపాటు విచారించిన ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో నటించిన వైవా హర్ష, గెటప్ శీను, వెన్నెల కిషోర్ సింగిల్ టేక్ ఆర్టిస్టులని, ఫ్రెష్ కంటెంట్ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో వస్తున్న ఈ సినిమా ప్రతి ఇంట్లో చర్చనీయాంశమవుతుందని తెలిపారు.

హీరో అర్విన్ తేజ్ మాట్లాడుతూ, తమ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నామని, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఎంతో క్రియేటివ్‌గా ఉంటుందని చెప్పారు. సమర్పకుడు వైవా హర్ష మాట్లాడుతూ, చిన్న సినిమా అయినప్పటికీ తక్కువ బడ్జెట్‌లో ఎంత గ్రాండ్ విజువల్స్ తీయవచ్చో నిరూపించడానికి బాల 369 ఒక కేస్ స్టడీలా నిలుస్తుందని, కుటుంబమంతా కలిసి చూడాల్సిన మంచి కంటెంట్ ఉన్న ఈ చిత్రాన్ని నవంబర్ 27న థియేటర్లలో ఆదరించాలని కోరారు.