BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: అజారుద్దీన్ సెంచరీ, సంజూ శాంసన్ మెరుపులతో హిమాచల్ ప్రదేశ్‌పై కేరళ ఘన విజయం కృనాల్ పాండ్యాపై బూట్లు విసిరిన ప్రేక్షకుడు: తృటిలో తప్పించుకున్న బరోడా కెప్టెన్ 32 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమిళనాడు మాజీ కెప్టెన్ బాబా అపరాజిత్ పొనకల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా ఉత్తరాఖండ్‌పై ముంబై ఘన విజయం యువతలో పెరుగుతున్న రక్తంలో చక్కెర స్థాయిలతో మధ్యవయసులో జ్ఞాపకశక్తి సమస్యలు సిరికొండలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మహిళలపై హింస నిర్మూలనకు తక్షణ చర్యలు అవసరం చెన్నై భక్తుడు తిరుమల శ్రీవారికి సమర్పించిన నగల జాబితా ఇదే.. చెడు వ్యాసాలకు బలికావోద్దు పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు పనాజీ వీధుల్లో గోవా సంస్కృతిక వైభవం ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు

భక్తి భావంతో మార్మోగిన రాజాపురం..

Select Suryaa Now
భక్తి భావంతో మార్మోగిన రాజాపురం..

భక్తిభావంతో మార్మోగిన రాజాపురం ..
- అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడి పూజ..  

శబరిమలై యాత్రకు ముందు నిర్వహించే మహా పడి పూజ అంటే అయ్యప్ప భక్తులకు ఎంతో పవిత్రమైన ఘట్టం. అలాంటి పూజ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో బుధవారం రాత్రి  అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామం మొత్తం భక్తిభావంతో మార్మోగిపోయింది.అయ్యప్ప దీక్ష తీసుకుని తొలిసారి శబరిమలై వెళ్తున్న పుచ్చకాయల సుధాకర్ రెడ్డి వారి నివాసగృహంలో  మహా పడి పూజను నిర్వహించారు. ఇంటి ఆవరణలో 18 మెట్లను అరటి దొప్పలు, పచ్చి పూలతో ఎంతో సుందరంగా అలంకరించారు.  అలంకరణ చూసిన భక్తులు శబరిమలై సన్నిధానాన్ని తలపించిందని చెప్పుకున్నారు.రంగ, పుల్లూరు వెంకటేశ్వరావు, రాము గురు స్వాముల సమక్షంలో అయ్యప్ప విగ్రహానికి అభిషేకం, పదునెట్టాంబడి, కలశ పూజ ఘనంగా జరిగాయి. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో ప్రాంగణం అంతా ప్రతిధ్వనించింది.అబ్బుగూడెం, పెంట్లం తదితర పలు గ్రామాల నుండి అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులు భారీగా తరలివచ్చారు. వారంతా కలిసి చేసిన భజనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పుచ్చకాయల కృష్ణకుమారి, గౌతమి, కృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, బొబ్బిలి, చెన్నుబోయిన సత్యం, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వరావు, నాగేశ్వరావు, బొబ్బిలి, సుశీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్/ అన్నపురెడ్డిపల్లి…