telangana
నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సోమాజిగూడ /మేజర్ న్యూస్ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఐపీ బిల్లింగ్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన మహనీయుల చిత్రపటాల వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను స్మరించుకున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని, సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిమ్స్ డీన్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి, లెసన్ ఆఫీసర్ రవి, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యగౌడ్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేజియా, సేవా నాయక్‌లతో పాటు సుజాత, రమణమ్మ, రాములు, బిడుగు శేఖర్, విద్యాసాగర్, జ్యోతి, శైలజ, తేజ, గోవింద్, సుశీల, దయాకర్, ప్రశాంత్ తదితరులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.