telangana
పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు
సూర్య, జన్నారం : జన్నారం మండలం పొనకల్ మేజర్ పంచాయతీలో గల రేణుక ఎల్లమ్మ ఆలయంలో గురువారం నూతన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మండల గౌడ సంఘం అధ్యక్షులు మూల భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఈనెల 29న ఆలయం వద్ద పోచమ్మ బోనాలతో పాటు డిసెంబర్ 1న ఎల్లమ్మ బోనాలను నిర్వహించడం జరుగుతుందని, అధిక సంఖ్యలో గౌడ కులస్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.