telangana
తేజాపూర్, శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన
సూర్య.నేరడిగొండ : విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యత పెంచేందుకే 'ఖాకీ కిడ్స్' కార్యక్రమం. విద్యార్థి దశ నుంచే చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని పోలీసులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఖాకీ కిడ్స్' అవగాహన కార్యక్రమాన్ని గురువారం మండలకేంద్రంలోని తేజాపూర్,శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాకీ కిడ్స్ పోలీసు రాయిసిడాం.రమేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపద సమయంలో 'డయల్ 112' సేవలను ఎలా వినియోగించుకోవాలి, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, క్రమశిక్షణ పెంపొందించేందుకు జిల్లా పోలీసులు చేపట్టిన ఖాకీ కిడ్స్ కార్యక్రమం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇలాంటి అవగాహన సదస్సుల వల్ల విద్యార్థులకు పోలీసు వ్యవస్థపై ఉన్న భయం పోయి, స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజాపూర్ ప్రధానోపాధ్యాయురాలు మనీ లత ,పధానోపాధ్యాయుడు నానక్ సింగ్.పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.