సూర్య, రామకృష్ణాపూర్ : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో గురువారం ఇందిరమ్మ బీమా పతకాన్ని ప్రారంభించిన మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ మిట్టపెల్లి సరిత - శ్రీనివాస్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీమా పతకాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలి అనీ కోరారు, ఏదయినా ప్రమాదం జరిగిన ఇంటి పెద్ద మరణించిన ఈ బీమా కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుంది అనీ అన్నారు. ఈ బీమా తెల్ల రేషన్ కార్డు ఉండి 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాల లోపు వారు అర్హులు అనీ వైట్ కార్డు ఉన్నవారు వైట్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని స్థానిక స్నేహ గణేష్ మండపం వద్దకు రావాలని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమం లో వార్డు ఆఫీసర్ రాజేశ్వరి ఆపరేటర్ కుమారస్వామి, ఆశ వర్కర్ శోభ పాల్గొన్నారు.