BREAKING
పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు పనాజీ వీధుల్లో గోవా సంస్కృతిక వైభవం ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు తేజాపూర్, ​శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆర్టీసీ బస్ భవన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ బీమా పతకాన్ని సద్వినియోగం చేసుకోవాలి వైస్ చైర్ పర్సన్ మిట్టపెల్లి సరిత - శ్రీనివాస్ ఇంటి దారినీ మూసేస్తారా? హైడ్రా, ట్రాఫిక్ పోలీసులపై పోలీస్ కమిషనర్‌కు ఏడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు అద్భుత స్పిన్నర్ కుల్దీప్‌ను అందుకే ఇండియాకు పంపేశారు.. కివీస్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు! సైబరాబాద్‌ రవాణా వ్యవస్థకు కొత్త దిశ.. రెండో టెస్ట్ తుది జట్టులో ఆ ఇద్దరిని తప్పించాలి.. సిరాజ్, జడేజాలను తీసుకోవాలన్న ఆకాశ్ చోప్రా! భక్తి భావంతో మార్మోగిన రాజాపురం.. క్రైస్ట్‌చర్చ్ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ విధ్వంసం.. 21 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్!

మహిళా విద్య కోసం ఫూలే దంపతుల పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు ప్రతీక్ గాంధీ!

Select Suryaa Now
మహిళా విద్య కోసం ఫూలే దంపతుల పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు ప్రతీక్ గాంధీ!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: భారతీయ సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల స్ఫూర్తిదాయక జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఫూలే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అనంత్ నారాయణ్ మహదేవన్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే హిందీ, మరాఠీ భాషల్లో విశేష ఆదరణ పొందిన ఈ సినిమాను సుపదా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత డాక్టర్ పొన్నం రవిచంద్ర తెలుగులో నిర్మించగా, ఏషియన్ సినిమాస్ ద్వారా నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. నవంబర్ 28న మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన ఆశయాలను నేటి తరానికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఫూలే తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కథానాయకుడు ప్రతీక్ గాంధీతో పాటు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు సురేష్ లాల్, నిర్మాత మధుర శ్రీధర్, నటుడు రచ్చ రవి, ఐఏఎస్ అధికారి శ్యామ్ ప్రసాద్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రతీక్ గాంధీ మాట్లాడుతూ, మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం ఫూలే దంపతులు చేసిన మహోన్నత పోరాటం నేటి తరానికి ఎంతో ఆదర్శమని కొనియాడారు. 200 ఏళ్ల క్రితం వారు వేసిన బలమైన పునాదుల వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారని, అలాంటి మహనీయుల పాత్రలో నటించడం తన అదృష్టమని పేర్కొన్నారు.

నిర్మాత డాక్టర్ పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ, ప్రతి మహిళ తప్పక చూడాల్సిన గొప్ప సందేశాత్మక చిత్రమిదని తెలిపారు. తెలుగు వెర్షన్ కోసం చేతన్ కత్తి పదునైన సంభాషణలు అందించారని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల వరకు ఈ సినిమాను తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. దర్శకుడు అనంత్ నారాయణ్ మహదేవన్ వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలోని గొప్ప సందేశాన్ని ఆదరించి ఆశీర్వదిస్తారని ఆకాంక్షించారు.

సాధారణ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాకు సంగీతం అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ పేర్కొన్నారు. పుస్తకాల్లో చదువుకున్న మహనీయుల చరిత్రను వెండితెరపై చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్మాత మధుర శ్రీధర్, మామిడి హరికృష్ణ అభిప్రాయపడ్డారు. సమాజంలో చైతన్యం నింపే కథాంశంతో వస్తున్న ఫూలే చిత్రంపై తెలుగు సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.