BREAKING
32 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమిళనాడు మాజీ కెప్టెన్ బాబా అపరాజిత్ పొనకల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా ఉత్తరాఖండ్‌పై ముంబై ఘన విజయం యువతలో పెరుగుతున్న రక్తంలో చక్కెర స్థాయిలతో మధ్యవయసులో జ్ఞాపకశక్తి సమస్యలు సిరికొండలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మహిళలపై హింస నిర్మూలనకు తక్షణ చర్యలు అవసరం చెన్నై భక్తుడు తిరుమల శ్రీవారికి సమర్పించిన నగల జాబితా ఇదే.. చెడు వ్యాసాలకు బలికావోద్దు పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు పనాజీ వీధుల్లో గోవా సంస్కృతిక వైభవం ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు తేజాపూర్, ​శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

సమాజంలో అమ్మాయిల గురించి వాస్తవ, బోల్డ్ విషయాలనే చూపించాను.. ‘ఐ హేట్ మ్యారేజ్’ దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల ఇంటర్వ్యూ!

Select Suryaa Now
సమాజంలో అమ్మాయిల గురించి వాస్తవ, బోల్డ్ విషయాలనే చూపించాను.. ‘ఐ హేట్ మ్యారేజ్’ దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల ఇంటర్వ్యూ!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సుగి విజయ్, నూతన నటి జుప్సీ భద్ర జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఐ హేట్ మ్యారేజ్ శుక్రవారం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పరమేష్ రేణుకుంట్ల దర్శకత్వం వహించారు. సినిమా విడుదల సందర్భంగా గురువారం మీడియాతో ముచ్చటించిన దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల, చిత్ర కథాంశం, నేటి తరం ఆలోచనలు, తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సమాజంలో యువత, ముఖ్యంగా అమ్మాయిల ఆలోచనల్లో వస్తున్న మార్పులను ఎంతో వాస్తవికంగా, బోల్డ్‌గా ఈ చిత్రంలో ఆవిష్కరించానని ఆయన స్పష్టం చేశారు.

తన సినీ నేపథ్యం గురించి వివరిస్తూ, 2002లో దర్శకనిర్మాత సానా యాదిరెడ్డి వద్ద రచయితగా ప్రయాణం ప్రారంభించానని, ఆయన దర్శకత్వంలో వచ్చిన అభిమాని సినిమాకు కథా రచయితగా పనిచేశానని పరమేష్ తెలిపారు. ఆ తర్వాత సంపత్ నంది సహా పలువురు దర్శకుల వద్ద రచయితగా పనిచేశానని, గతంలో హీరో రవితేజకు కూడా కథ వినిపించగా కథ నచ్చినప్పటికీ దర్శకత్వ అవకాశం రాలేదని చెప్పారు. 2011 నుంచి దర్శకుడిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తూ, చివరికి చిన్న సినిమాతో పరిచయం కావాలనే ఉద్దేశంతో ఐ హేట్ మ్యారేజ్ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వివరించారు.

ఈ చిత్ర కథాంశం గురించి మాట్లాడుతూ, నేటి సమాజంలో కొందరు అమ్మాయిలు ప్రేమ, స్నేహం పేరుతో సరదాగా గడిపినా చివరికి తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే వివాహం చేసుకుంటున్నారని, పెళ్లి పట్ల వారి ఆలోచనలు ఎలా ఉన్నాయనే అంశంపై లోతుగా పరిశోధన చేసి 2021లో ఈ కథను రాశానని దర్శకుడు తెలిపారు. పెళ్లి అంటే ఇష్టం లేకపోయినా కేవలం తల్లిదండ్రుల కోసమే వివాహం చేసుకుంటున్నామని చాలా మంది అభిప్రాయపడ్డారని, అలాంటి ఒక అమ్మాయి, ఎలాంటి ఎమోషన్స్ లేని ఒక అబ్బాయి మధ్య నడిచే ఆసక్తికరమైన ప్రేమకథే ఈ సినిమా అని పేర్కొన్నారు. కేవలం బోల్డ్‌గా చూపించాలనే ఉద్దేశంతో కాకుండా, సమాజంలో కనిపించే జెన్ జీ యువత, తల్లిదండ్రుల మధ్య ఉండే సంఘర్షణను నిజాయితీగా చూపించామన్నారు.

సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకుంటూ, దాదాపు 30 మంది స్నేహితులు, బంధుమిత్రుల ఆర్థిక సహకారంతో ఈ సినిమాను పూర్తి చేశానని, ముఖ్యంగా తన మేనల్లుడు కార్తీక్ వెంపటి సగం బడ్జెట్ భరించారని పరమేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎడిటర్ ఆవుల వెంకటేష్ తన ఫుటేజ్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది సినిమా విజయానికి బలమైన పునాది వేశారని కొనియాడారు. రేపు థియేటర్లలో విడుదలవుతున్న ఐ హేట్ మ్యారేజ్ చూసిన తర్వాత ప్రేక్షకులు ప్రతి పాత్ర గురించి తప్పకుండా చర్చించుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.