BREAKING
32 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమిళనాడు మాజీ కెప్టెన్ బాబా అపరాజిత్ పొనకల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా ఉత్తరాఖండ్‌పై ముంబై ఘన విజయం యువతలో పెరుగుతున్న రక్తంలో చక్కెర స్థాయిలతో మధ్యవయసులో జ్ఞాపకశక్తి సమస్యలు సిరికొండలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మహిళలపై హింస నిర్మూలనకు తక్షణ చర్యలు అవసరం చెన్నై భక్తుడు తిరుమల శ్రీవారికి సమర్పించిన నగల జాబితా ఇదే.. చెడు వ్యాసాలకు బలికావోద్దు పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు పనాజీ వీధుల్లో గోవా సంస్కృతిక వైభవం ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు తేజాపూర్, ​శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై గీతంలో శిక్షణ

Select Suryaa Now
ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై గీతంలో శిక్షణ
హైదరాబాద్ ,మేజర్ న్యూస్ ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది వృత్తిపరమైన సంభాషణ నైపుణ్యాలను పెంపొందించేందుకు నవంబర్ 25, 26 తేదీల్లో ‘పని ప్రదేశంలో ఈమెయిల్, వాట్సాప్ ద్వారా సంభాషణ’ అంశంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతం విద్యా నూతన ఆవిష్కరణ, అభివృద్ధి కేంద్రం (సీఏఐఏ) శిక్షకుడు మెహుల్ షా ఈమెయిల్, వాట్సాప్ వినియోగంలో పాటించాల్సిన ఉత్తమ పద్ధతులు, చేయాల్సినవి, చేయకూడని అంశాలపై సిబ్బందికి మార్గదర్శనం చేశారు. ఈమెయిల్‌లో స్పష్టత, మర్యాద, సంక్షిప్తత, సరైన భాష, సందేశ నిర్మాణం,సీసీ, బీసీసీల వినియోగం, సకాలంలో స్పందించడం వంటి అంశాలను వివరించారు. వాట్సాప్‌ను అధికారిక పత్రాల కోసం కాకుండా, త్వరిత సమాచార మార్పిడి, సమన్వయం కోసం ఉపయోగించాలని సూచించారు.
గోప్యమైన సమాచార పరిరక్షణ, కమ్యూనికేషన్ హద్దుల గౌరవం, ధృవీకరించని సమాచారాన్ని ఫార్వార్డ్ చేయకుండా ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆచరణాత్మక ఉదాహరణలు, ఇంటరాక్టివ్ రోల్-ప్లేల ద్వారా సమర్థవంతమైన సంభాషణ పద్ధతులను వివరించారు. సీఏఐఏ వృత్తి నైపుణ్యాల నిపుణుడు సాను జకారియా, శిక్షణా నిర్వహకురాలు డి.ఎం. ప్రియాంక కార్యక్రమాన్ని సమన్వయం చేశారు