BREAKING
దేశ కథా సంప్రదాయాలు, భారతీయ సినిమా వైభవంపై ప్రత్యేక చర్చ ప్రతిష్టాత్మక ఐటీయూ ప్లెనిపొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2030కు భారత్ ఆతిథ్యం వారణాసిలో నేడు కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభోత్సవం మాటలు చెప్పడానికి కాదు.. అభివృద్ధి చేసి చూపించడానికి వచ్చా: ప్రవీణ్ రెడ్డి! కోడిగేనహళ్లిని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే నాలక్ష్యం.. పదవి కోసం కాదు.. పుట్టి పెరిగిన గడ్డకు సేవ చేయడానికే పోటీ.. శనివారం సుబ్బరాయునిపల్లి కాలువపల్లిలో విస్తృత ప్రచారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిజోరం, నాగాలాండ్ పర్యటన తిరుప్పరంగున్రం దీపం వివాదం వేళ మురుగన్ భక్తి నినాదం పంచుకున్న ప్రధాని మోదీ ఉక్రెయిన్ శాంతి, ఇండో-పసిఫిక్ భద్రత, ఉగ్రవాదంపై భారత్-ఈయూ ఉమ్మడి నిబద్ధత బిమ్‌స్టెక్ అండర్-23 అథ్లెటిక్స్ 2026లో భారత్ అగ్రస్థానం ఐఐటీఎఫ్ 2026లో సీబీఐసీ జీఎస్టీ అండ్ కస్టమ్స్ పెవిలియన్‌కు కాంస్య పతకం బెంగళూరులో 65వ ఐసామ్ వార్షిక సదస్సు కార్తీక దీపం అంటుకుని యువతి మృతి జగన్మోహిని ఆలయంలో ప్రత్యేక పూజలు ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు హోటల్ గదిలో గుంటూరు యువకుడి అనుమానాస్పద మృతి అల్లాపల్లి పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి జయం జగదీష్ విస్తృత ప్రచారం --------- కత్తెర గుర్తుకు ఓటు వేయాలని వినతి

జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ: సభ్యుడిగా అల్లు అరవింద్ నియామకం

Select Suryaa Now
జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ: సభ్యుడిగా అల్లు అరవింద్ నియామకం

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: 2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. కమిటీ సభ్యులుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఎస్. గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభలను ప్రభుత్వం ఖరారు చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఈ కమిటీని నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. జ్యూరీ కమిటీ నియామకానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని విజయవాడలోని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు అందించింది.

సినీ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన బాలకృష్ణ చైర్మన్‌గా, అల్లు అరవింద్, ఎస్. గోపాల్ రెడ్డి, ప్రభ వంటి ప్రముఖులు సభ్యులుగా నియమితులు కావడంతో అవార్డుల ఎంపిక ప్రక్రియపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 2025 జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రతిపాదనలు, ఎంపిక అంశాలను ఈ కమిటీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనుంది.

మరోవైపు పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి కూడా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 2017 నుంచి 2025 వరకు వివిధ విభాగాలకు వేర్వేరు జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, త్వరలోనే పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పరిణామాలతో తెలుగు చిత్రసీమలో అవార్డుల సందడి మరోసారి మొదలైంది.