BREAKING
సాని వారి పల్లి సర్పంచ్ గా శ్రీనివాసులు విజయం నేడు మూడో రోజు కిషన్ రెడ్డి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీ భాగ్యనగరానికి వాన ఊరట 2026-27 సహకార రోడ్‌మ్యాప్‌కు సభ్య దేశాల ఆమోదం ఫలించిన గుకేశ్ వ్యూహం.. మూడో గేమ్ డ్రా ఫోక్సో కేసులో నిందితుడికి సంవత్సరం జైలు శిక్ష. తీవ్ర ఒడిదుడుకుల తర్వాత నిలదొక్కుకుంటున్న ఆసియా షేర్లు ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆదర్శ కుటుంబం’: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా కేంద్ర బడ్జెట్ 2027-28 రూపకల్పనకు ముందస్తు సంప్రదింపులు పూర్తి ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలు రూ.127 లక్షల కోట్లకు చేరిక కమర్షియల్ లెక్కలు లేకుండా చేసిన సినిమా: ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లాంచ్‌లో నితిన్ భావోద్వేగ ప్రసంగం పాక్ సిరీస్‌పై సినీ కార్మిక సంఘం అల్టిమేటం: ఆ సిరీస్ ఆపకపోతే నెట్‌ఫ్లిక్స్ షూటింగ్‌లు బంద్ చేస్తామని హెచ్చరిక 14వ జేడీసీసీ సమావేశంలో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన భారత్, యూఏఈ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు కేరళ, మిజోరం, నాగాలాండ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీ

Select Suryaa Now
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: సోమవారం (నవంబర్ 30) నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు 10 జనపథ్‌లోని ఆమె నివాసంలో పార్టీ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం కానుంది.

ఈ భేటీలో లోక్‌సభ, రాజ్యసభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే, ఉభయసభల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు విపక్షాలన్నీ సమన్వయంతో, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగే అంశంపైనా సీనియర్ నేతలు సమాలోచనలు జరపనున్నారు.