నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి వేల్పుల చంద్రశేఖర్ ముమ్మర ప్రచారం
ఓటుతో ఆశీర్వదిస్తే...గ్రామాభివృద్యే లక్ష్యంగా పనిచేస్తా. - శ్రీపతిరావుపేట సర్పంచ్ అభ్యర్థి వేల్పుల చంద్రశేఖర్
- ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలంటే గ్రామంలో ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : శ్రీపతిరావు పేట గ్రామ ప్రజలు ఓటుతో ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి వేల్పుల చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని శ్రీపతిరావు పేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వేల్పుల చంద్రశేఖర్ ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలంటూ వైసిపి సీనియర్ నాయకులు పుల్లారెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని తపనతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గ్రామ ప్రజలు సహకరించి సర్పంచిగా ఆశీర్వదిస్తే అభివృద్ధితో పాటు గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. గ్రామంలోని ప్రతి వార్డులో మౌలిక వసతులతో పాటు పారిశుద్ధ్యం లోపించకుండా చూస్తూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పుతూ ఆదర్శ గ్రామంగా వార్డు మెంబర్ల ప్రజల సహకారంతో తీర్చిదిద్దుతానని ప్రచారంలో ముందుకు సాగారు. ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపిస్తే నాయకుడిగా కాకుండా గ్రామ ప్రజలకు సేవకుడిగా సేవలందిస్తూ అంకితభావంతో పనిచేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగారు.