ఇందిరమ్మ జీవిత బీమా పథకం వివరాల సేకరణ పరిశీలన -- ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
సూర్య కమ్మర్ పల్లి: కమ్మర్ పల్లి మండలంలోని హాసాకొత్తూర్ గ్రామ పంచాయతిని ఎంపీడీవో చింత రాజు శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్బంగా ఎంపిడివో మాట్లాడుతు రాష్ట్రా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం"అర్హులైన లబ్ధిదారుల వివరాల సేకరణ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు.లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డేటా ఎంట్రీలో కుటుంబికుల పేర్లు ఎలాంటి తప్పిదం లేకుండా సమన్వయంతో క్రమశిక్షణతో లబ్దిదారుల జాబితాను స్పష్టంగా పూర్తి చెయ్యాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేవతి గంగారెడ్డి, పంచాయతీ సెక్రటరీ సల్లగంటి నర్సయ్య, వార్డ్ మెంబెర్ కుండేటి శ్రీను, మండపల్లి మహేందర్, ఆశ వర్కర్ మేకల కల్పన కంప్యూటర్ ఆపరేటర్ లు పాల్గొన్నారు.