జిల్లెల్ల వ్యవసాయ కళాశాలలో రేపు కిసాన్ మేళా
సూర్య రాజన్న సిరిసిల్ల..ఆత్మ పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో రేపు శనివారం తేది. 28-11-2026 నాడు ఉదయం 10 గంటలకు కిసాన్ మేళా నిర్వహించబడును.రైతుల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఈ కిసాన్ మేళాలో నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన విత్తనాలు, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ యంత్రాలు, ప్రభుత్వ పథకాలు మరియు విలువ ఆధారిత కార్యక్రమాలపై అవగాహన కల్పించబడును. జిల్లాలోని రైతు సోదరులు అందరూ ఈ కిసాన్ మేళాలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా పీడీ, ఆత్మ, రాజన్న సిరిసిల్ల కోరుతున్నారు.