telangana
కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం
దుండిగల్ మేజర్ న్యూస్ సిఎంసీ దుండిగల్ సర్కిల్ పరిధిలోని డి.పోచంపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన “మాయా” ది కేఫ్‌ను బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గురువారం ప్రారంభించారు. తాజా టిఫిన్స్ సమీపంలో సన్నీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ నేటి రోజుల్లో ప్రజలు నాణ్యతతో పాటు సరికొత్త రుచులను కోరుకుంటున్నారని అన్నారు. కాఫీ, టిఫిన్స్‌తో పాటు వినియోగదారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేవలు అందిస్తూ “మాయా” ది కేఫ్ మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. రుచికరమైన ఆహార పదార్థాలను నాణ్యతతో అందిస్తూ కస్టమర్ల ఆదరణను చూరగొనాలని నిర్వాహకులకు సూచించారు. డి.పోచంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేఫ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొంటూ, వ్యాపార రంగంలో మరింతగా అభివృద్ధి చెంది విజయవంతంగా కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం కేఫ్‌ను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాలే నాగేష్, కాలే గణేష్, బాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.