సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు
కొండాపూర్,మేజర్ న్యూస్ : నగరంలోని కొండాపూర్‌లో ఉన్న జిస్మాట్ జైల్ మండి రెస్టారెంట్‌లో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. రెస్టారెంట్‌లో సూప్ ఆర్డర్ చేసిన ఓ వినియోగదారుడికి అందులో బొద్దింకలు కనిపించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించగా అపరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు రెస్టారెంట్ యాజమాన్యానికి మెమోలు జారీ చేయడంతో పాటు కార్యకలాపాలను నిలిపివేస్తూ సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి నిహారిక వెల్లడించారు.రెస్టారెంట్ యాజమాన్యం లోపాలను సరిదిద్దుకున్న తర్వాత మరోసారి తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని లోపాలను సరి చేసినట్లు నిర్ధారణ అయిన తర్వాతే తిరిగి కార్యకలాపాలకు అనుమతిస్తామన్నారు. జారీ చేసిన మెమోలపై అడ్జుడికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆహార తయారీ, నిల్వలో అపరిశుభ్రత పై తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.