telangana
రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన అవసరం : ఆచార్య జి.నాగరాజు
రాయదుర్గం,మేజర్ న్యూస్ : అన్యాయాలు, అక్రమాలు, అరాచకాల నుంచి కాపాడుకునేందుకు భారత రాజ్యాంగం అనేక హక్కులు, రక్షణ కల్పించిందని ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం అధిపతి ఆచార్య నాగేశ్వరరావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు భారత రాజ్యాంగ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య జి.నాగరాజు (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సోషియాలజీ విభాగపు అధిపతి) మాట్లాడుతూ చిన్ననాటి నుండి విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగంపై గౌరవం కలిగి అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కలిగి అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సత్యనారాయణ, శ్రీనివాస్, సురేష్ , చంద్రశేఖర్ మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.