BREAKING
పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి అభ్యంతరాలుంటే తెలియజేయాలి వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు! సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన అవసరం : ఆచార్య జి.నాగరాజు సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్‌ మొబైల్ అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ: నాగార్జునరెడ్డి పీవి ధ్వయం జీవన రేఖలు పుస్తకావిష్కరణ

భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ: నాగార్జునరెడ్డి

Select Suryaa Now
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ: నాగార్జునరెడ్డి
 వెంగళరావునగర్, మేజర్ న్యూస్:  భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత దేశ ప్రజలందరిది   అని జూబ్లీహిల్స్   నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి  అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి నెక్లెస్ రోడ్డు లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ ర్యాలీలో దేవిరెడ్డి నాగార్జునరెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్  ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దారి పొడవునా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదాలతో పాదయాత్రగా నెక్లెస్ రోడ్డు లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు జరిగిన ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగార్జునరెడ్డి  మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ అనేది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు అని, ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజల హక్కులను కాపాడుకునే బాధ్యత మనందరిదని అన్నారు. రాజ్యాంగ విలువలు,ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు