BREAKING
పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి అభ్యంతరాలుంటే తెలియజేయాలి వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు! సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన అవసరం : ఆచార్య జి.నాగరాజు సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్‌ మొబైల్ అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ: నాగార్జునరెడ్డి పీవి ధ్వయం జీవన రేఖలు పుస్తకావిష్కరణ

మొబైల్ అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

Select Suryaa Now
మొబైల్ అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

హఫీజ్‌పేట్,మేజర్ న్యూస్ : జనప్రియనగర్ సాయిరాం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గురువారం డీసీ శ్రీనివాస్, డీడబ్ల్యూఓ శాంతిశ్రీ, సీడీపీఓ కవిత తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ఆరు సంవత్సరాల్లోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ప్రధాన లక్ష్యమన్నారు. బస్తీల్లోని ప్రజలకు చేరువగా ఉంటూ చిన్నారులకు పోషకాహారం, ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్య అందిస్తామని తెలిపారు. చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు, టీకాలు, తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తామన్నారు. అంగన్‌వాడీల్లో నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్య, ఆట వస్తువులు, ఎర్లీ చైల్డ్ కేర్ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయని, టీచర్లకు ఆంగ్లంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలకు అధిక ఖర్చు చేయకుండా ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, అక్తర్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సురేష్, సాదిక్, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.