BREAKING
మురుగు కూపం నుంచి సరికొత్త శోభతో మాదాపూర్ సున్నం చెరువు పెద్దపల్లి పంచాయితీపై ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ ఫోకస్ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు శేరి సతీష్ రెడ్డి నివాళి సైబరాబాద్‌ మూవ్స్‌–2026కు 200 మందికి పైగా ప్రతినిధులు పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి

Select Suryaa Now
డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి  బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి

తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులు, సంపన్న కుటుంబాల పెట్టుబడి నిర్వహణ సంస్థల్లో వర్చువల్ డిజిటల్ ఆస్తులపై (వీడీఏ) ఆసక్తి ఉన్నట్లు బిట్‌డెల్టా ఇండియా తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ విభాగంపై దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక అధ్యయనం నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 41 శాతం మంది డిజిటల్ ఆస్తుల్లో గతంలో లేదా ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడి అవకాశాలను పరిశీలించడం చేస్తున్నట్లు వెల్లడైంది. 45 శాతం మంది దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తుండగా, 68 శాతం మందికి డిజిటల్ ఆస్తులపై ప్రాథమిక అవగాహన మాత్రమే ఉంది. సమాచార సేకరణకు 60 శాతం మంది సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నారు. 59 శాతం మంది నియంత్రణపరమైన అనిశ్చితిపై ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ ఆస్తులపై పెట్టుబడిదారుల్లో అవగాహన పెంచడంతో పాటు విశ్వసనీయ పరిశోధన, మెరుగైన మార్గదర్శకత్వం అవసరమని బిట్‌డెల్టా ఇండియా సీఈఓ వికాస్ ఎం. సచ్‌దేవా పేర్కొన్నారు. ఈ రంగం సుస్థిర వృద్ధికి పారదర్శకత, నష్టభయ నిర్వహణ, బాధ్యతాయుతమైన విధానాలు కీలకమని భారత్ వెబ్‌3 అసోసియేషన్ చైర్మన్ దిలీప్ చెనోయ్ తెలిపారు