BREAKING
భారత్‌తో రెండో టెస్టు: తొలి రోజు ముగిసేసరికి న్యూజిలాండ్ 246/5 స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి** ప్రభుత్వ విప్ వేముల వీరేశం మురుగు కూపం నుంచి సరికొత్త శోభతో మాదాపూర్ సున్నం చెరువు పెద్దపల్లి పంచాయితీపై ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ ఫోకస్ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు శేరి సతీష్ రెడ్డి నివాళి సైబరాబాద్‌ మూవ్స్‌–2026కు 200 మందికి పైగా ప్రతినిధులు పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం

పెద్దపల్లి పంచాయితీపై ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ ఫోకస్

Select Suryaa Now
పెద్దపల్లి పంచాయితీపై ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ ఫోకస్

హైదరాబాద్, సూర్య ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను చల్లార్చి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్ దూకుడు పెంచారు. శుక్రవారం గాంధీభవన్‌కు చేరుకున్న ఆయన, ప్రధానంగా పెద్దపల్లి జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ క్రమంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను గాంధీభవన్‌కు పిలిపించి, జిల్లా రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య సమన్వయ లోపంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. నిన్ననే (గురువారం) మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గాంధీభవన్‌లో సందీప్‌ను కలిసిన నేపథ్యంలో, నేడు అడ్లూరి లక్ష్మణ్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

డిసెంబర్ 15 నుంచి జిల్లాల బాట:

కేవలం పెద్దపల్లి మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు సందీప్ కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా డిసెంబర్ 15 నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఆయా జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో నేరుగా భేటీ అయి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించనున్నారు.