BREAKING
స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి** ప్రభుత్వ విప్ వేముల వీరేశం మురుగు కూపం నుంచి సరికొత్త శోభతో మాదాపూర్ సున్నం చెరువు పెద్దపల్లి పంచాయితీపై ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ ఫోకస్ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు శేరి సతీష్ రెడ్డి నివాళి సైబరాబాద్‌ మూవ్స్‌–2026కు 200 మందికి పైగా ప్రతినిధులు పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి

సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు,

Select Suryaa Now
సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు,

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ను తొలిదశలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చని ఆమోర్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ ప్రత్యూష నరకుర్తి, డాక్టర్ నారాయణ్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక దగ్గు, కఫం, నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ధూమపానంతో పాటు వాయు కాలుష్యం, పరిశ్రమల పొగ, కట్టెల పొయ్యిల నుంచి వెలువడే పొగ కూడా సీవోపీడీకి కారణమవుతాయని వివరించారు.

40 ఏళ్లు దాటిన వారిలో ఈ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంటుందని, నిర్ధారణకు స్పైరోమెట్రీ పరీక్ష కీలకమని పేర్కొన్నారు. ధూమపానం మానేయడం, కాలుష్యానికి దూరంగా ఉండటం, వైద్యుల సూచనల మేరకు ఇన్‌హేలర్లు వాడటం, వ్యాక్సినేషన్ ద్వారా వ్యాధి తీవ్రతను నియంత్రించవచ్చన్నారు. ఆమోర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. ముందస్తు నిర్ధారణ, నిపుణుల వైద్యం, అత్యవసర చికిత్సలను అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమన్నారు. దీర్ఘకాలిక దగ్గు, కఫం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచించారు.