telangana
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు శేరి సతీష్ రెడ్డి నివాళి
హైదరాబాద్, మేజర్ న్యూస్: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సారథ్యంలో 395 అధికరణాలు, 9 షెడ్యూళ్లతో భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని గుర్తుచేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును పురస్కరించుకుని దేశ ప్రజలకు, కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలకు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ కన్వీనర్ మేకల మైఖేల్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఫణింద్ర కుమార్, ఉమ్మడి కేపీహెచ్‌బీ డివిజన్ అధ్యక్షుడు తమ్మినేని ప్రవీణ్, కొమ్ము బాబు, శ్రీధర్ చారి, రామకృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు కళ్యాణ్ బాబు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.