BREAKING
స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి** ప్రభుత్వ విప్ వేముల వీరేశం మురుగు కూపం నుంచి సరికొత్త శోభతో మాదాపూర్ సున్నం చెరువు పెద్దపల్లి పంచాయితీపై ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ ఫోకస్ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు శేరి సతీష్ రెడ్డి నివాళి సైబరాబాద్‌ మూవ్స్‌–2026కు 200 మందికి పైగా ప్రతినిధులు పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి

మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

Select Suryaa Now
మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

తాండూరు, మేజర్ న్యూస్:మంతటి గ్రామంలో తాను గతంలో సొంత డబ్బులతో ఇప్పించిన స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు నోటీసులు రావడంతో, వారు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారిని కలిసి తమ సమస్యను వివరించారు.గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన సిద్దారెడ్డి, హన్మప్ప తదితరుల విజ్ఞప్తి మేరకు సర్వే నంబర్ 129లో సుమారు మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి గ్రామస్తులకు అందించామని తెలిపారు. ఆ స్థలంలో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, సుమారు 50 మందికి పట్టాలు అందాయని, 30 ఏళ్లుగా ఇళ్లలో నివసిస్తున్నామని లబ్ధిదారులు వివరించారు. ప్రస్తుతం తమకు నోటీసులు రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు.స్పందించిన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు సంబంధిత అధికారులు, నోటీసులు ఇచ్చిన న్యాయవాదితో మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సమస్యను వివరించాలని సూచించారు. సమస్య పరిష్కారం కాకపోతే స్వయంగా గ్రామానికి వచ్చి పరిష్కరిస్తానని, మీ ఇళ్లకు ఎలాంటి ఇబ్బంది రానివ్వనని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టి. సురేష్, ఎన్. అంజిలప్ప, సాకలి నరసింహులు, తిరుపతి గోపాల్, నాటికరి రాములు, శేఖర్ గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.