BREAKING
అభ్యంతరాలుంటే తెలియజేయాలి 121 కిలోల బంగారు కానుక పటిష్టమైన 'బొక్కసం' భద్రత అభివృద్ధి పనులపై ప్రత్యేక అధికారి పరిశీలన భారత్‌తో రెండో టెస్టు: తొలి రోజు ముగిసేసరికి న్యూజిలాండ్ 246/5 స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి** ప్రభుత్వ విప్ వేముల వీరేశం మురుగు కూపం నుంచి సరికొత్త శోభతో మాదాపూర్ సున్నం చెరువు పెద్దపల్లి పంచాయితీపై ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ ఫోకస్ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు శేరి సతీష్ రెడ్డి నివాళి సైబరాబాద్‌ మూవ్స్‌–2026కు 200 మందికి పైగా ప్రతినిధులు పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి

స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి** ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Select Suryaa Now
స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి** ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నల్గొండ జిల్లా నకిరేకల్ :

మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక పథకాల ద్వారా చేయూతనందిస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  అన్నారు.అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ, తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ స్వయం శక్తి ఉపాధి పథకం కింద మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, జనరేటర్లు తదితర ఉపాధి పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నకిరేకల్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు పరికరాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ వర్గాల ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ స్వయం శక్తి ఉపాధి పథకం ద్వారా అందజేసిన పరికరాలతో మహిళలు సొంతంగా ఉపాధి పొందుతూ తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి, నకిరేకల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల వెంకన్న, చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య, పట్టణ అధ్యక్షుడు ఎద్దుల పూరి కృష్ణ, డిసిసి ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్,

 కేతేపల్లి  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎడ్ల ప్రవీణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు