అభివృద్ధి పనులపై ప్రత్యేక అధికారి పరిశీలన
నవాబుపేట సూర్య న్యూస్: నవాబుపేట మండల ప్రత్యేక అధికారి సునీత శుక్రవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.కాకర్లజాల,కాకర్లజాల తండా,కిషన్‌గూడ,రేకులచౌడపూర్,ఊరంచు తండా గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబాల సంక్షేమ పథకం దరఖాస్తుల నవీకరణ ప్రక్రియను పరిశీలించారు.అనంతరం గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తాగునీటి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి,ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే ప్రాథమిక పాఠశాలలు,అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి వాటి నిర్వహణ,విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు,పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ పర్యటనలో ఎంపీడీవో జయరాం నాయక్,ఎంపీఓ భద్రూ నాయక్,ఏఈ,సర్పంచులు రాజు,సంతోష్ నాయక్,లచ్చి,అఖిలబాలరాజు,రత్నమ్మ,పంచాయతీ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.