శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు
హిందూపురం పట్టణంలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ ఈ శీతాకాలంలో 10 సంవత్సరాల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నేటి దినపత్రిక సూర్య టౌన్ ప్రతినిధితో వివరించారు.
*. చలి నుంచి రక్షణ:*
- ఉదయం, సాయంత్రం చలి ఎక్కువగా ఉంటుంది. వెచ్చని స్వెటర్, మఫ్లర్, టోపీ, సాక్స్ తప్పనిసరిగా వేయండి
- రాత్రి దుప్పటి బాగా కప్పండి, కానీ ముఖం మీద పడకుండా చూడండి
- చలిగాలికి నేరుగా తిరగనివ్వకండి
*. ఆహారం - నీరు:*
- గోరువెచ్చని నీరు తాగించండి, చల్లని నీరు, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ తగ్గించండి
- పాలు, గుడ్డు, పప్పు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఇవ్వండి
- జలుబు ఉంటే వేడి పాలు + పసుపు, తేనె మంచిద
* జలుబు, దగ్గు, జ్వరం:*
- జలుబు, దగ్గు వస్తే వెంటనే సొంతంగా మందులు వేయకండి, డాక్టర్ ను సంప్రదించండి. ముక్కు కారడం, గొంతు నొప్పి ఉంటే ఆవిరి పట్టించడం మంచిది
- దగ్గు వచ్చే పిల్లలను ఇతర పిల్లలకు దూరంగా ఉంచండి
* చర్మ సంరక్షణ:*
- చలికి చర్మం పగులుతుంది. స్నానం తర్వాత కొబ్బరి నూనె / మాయిశ్చరైజర్ రాయండి పెదాలు పగిలితే లిప్ బామ్ వాడాలి . రోజూ వేడి నీటితో స్నానం చేయించకండి, గోరువెచ్చని నీరు చాలు*. పరిశుభ్రత:*
చేతులు తరచుగా కడుక్కోవడం అలవాటు చేయండి.బయట నుంచి వచ్చాక కాళ్లు, చేతులు కడుక్కోండి
-బట్టలు, దుప్పట్లు ఎండలో ఆరబెట్టండి* ఇంట్లో జాగ్రత్త:*
ఇంట్లో దోమలు, దుమ్ము లేకుండా చూడండి.రూమ్ హీటర్, కుంపటి వాడితే పిల్లలకు దూరంగా ఉంచండి, గాలి ఆడేలా చూడండి. పిల్లలకు జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, ఆహారం తినకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.
హిందూపురం టౌన్ సూర్య రిపోర్టర్ , నాగరాజు