తెలంగాణకు భారీ వర్షాలు
సూర్య తాడ్వాయి: తెలంగాణ రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు..