BREAKING
పోలీస్ పెట్రోలింగ్ పార్టీ చొరవ.. తప్పిపోయిన బాలుడు క్షేమం తెలంగాణకు భారీ వర్షాలు తట్టేపల్లి వద్ద విద్యార్థుల ఆందోళన.. సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ లాట్వియా గగనతలంలోకి గుర్తుతెలియని డ్రోన్.. అప్రమత్తమైన నాటో యుద్ధ విమానాలు: మెర్సిడెస్-బెంజ్ చైనాలో కొత్త సంయుక్త సంస్థ.. విడిభాగాల తయారీ, సరఫరాపై ప్రత్యేక దృష్టి: సౌదీ అరాంకో చమురు శుద్ధి కేంద్రంపై దాడి.. పేరాల ఆంజనేయ విగ్రహానికి నిప్పు యూరోపియన్ సమాఖ్య దీర్ఘకాలిక బడ్జెట్‌పై ఏడాది చివరికల్లా ఒప్పందం.. నిర్మాణ పరికరాల మార్కెట్‌కు భారీ ఊతం.. విదేశీ పెట్టుబడుల వెల్లువతో భారత మార్కెట్లకు సానుకూల సంకేతాలు.. గిఫ్ట్ నిఫ్టీ 0.14 శాతం పతనం.. దేశీయ మార్కెట్లకు స్వల్ప బలహీన ప్రారంభ సంకేతాలు: లాభాల స్వీకరణ, ముడిచమురు ధరల ఒత్తిడి! జపాన్ మార్కెట్‌లో మళ్లీ కొనుగోళ్ల జోరు.. 0.4 శాతం పెరిగిన నిక్కీ: ఏఐ, సెమీకండక్టర్ షేర్లలో రికవరీతో పుంజుకున్న సూచీ! శ్రీ భవిగి భద్రేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా మేడి మహేష్ కుమార్ నియామకం అమెరికా తూర్పు తీరాన్ని వణికించిన భారీ తుపాను.. ఇందిరమ్మ జీవిత బీమా పథకం వివరాల సేకరణ పరిశీలన -- ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్

పోలీస్ పెట్రోలింగ్ పార్టీ చొరవ.. తప్పిపోయిన బాలుడు క్షేమం

Select Suryaa Now
పోలీస్ పెట్రోలింగ్ పార్టీ చొరవ.. తప్పిపోయిన బాలుడు క్షేమం

సూర్య కోరుట్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలుడిని పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. హాజీపూర్‌కు చెందిన గుంటుక మహాన్ (8), తండ్రి మహేష్, రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి 11 గంటలైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.ఈ క్రమంలో కల్లూరు రోడ్డులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సమీపంలో పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందికి బాలుడు కనిపించాడు. వెంటనే వివరాలు తెలుసుకున్న పోలీసులు బాలుడి ఇంటి చిరునామా గుర్తించి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లి క్షేమంగా అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎస్ఐ కె. గంగాధర్ పోలీసుల సేవలను అభినందించారు.