BREAKING
మహానది కోల్‌ఫీల్డ్స్ మార్కెట్‌లోకి ప్రవేశం.. ఇష్యూ ధర కంటే 2 శాతం తగ్గింపుతో షేర్ల నమోదు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందన్న పీయూష్ గోయల్ హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు.. భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం* సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత.. శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు సంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం.. తడిసిముద్దైన వరి ధాన్యం.. భక్త కనకదాసు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శశికళ కృష్ణమోహన్ నాగసముందర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం మహిళా శక్తికి ప్రతీక రుద్రమదేవి-చందుపట్లలో ఘనంగా వర్ధంతి సభ.. నివాళులర్పించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ పోలీస్ పెట్రోలింగ్ పార్టీ చొరవ.. తప్పిపోయిన బాలుడు క్షేమం తెలంగాణకు భారీ వర్షాలు

సంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం.. తడిసిముద్దైన వరి ధాన్యం..

Select Suryaa Now
సంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం.. తడిసిముద్దైన వరి ధాన్యం..

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. జిల్లాలోని ఆందోల్, చౌటాకూర్, పుల్కల్ తదితర మండలాల్లో గురువారం రాత్రి నుంచి జోరువాన కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం చేతికందే సమయంలో వర్షం విరుచుకుపడటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం కుప్పలు భారీ వర్షానికి పూర్తిగా తడిసిముద్దయ్యాయి. టార్పాలిన్ పట్టాలు కప్పేలోపే వర్షపు నీరు చేరడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలు జలమయం కావడంతో కొన్నిచోట్ల వరి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.