నాగసముందర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కె. వెంకటేశం, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు మరియు సంబంధిత సిబ్బంది ప్రారంభించారు.ఈ సందర్భంగా పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు, ప్రయోజనాలు, అర్హతలు మరియు నమోదు ప్రక్రియ గురించి గ్రామ ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.