మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సూర్య జగిత్యాల ప్రతినిధి:మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడకు చెందిన సింధూజ అలియాస్ తుషారిక (36) నెక్ట్స్ టర్న్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ ఏడాదికి రూ.26 లక్షల వేతనంతో మియాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్, ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. పదేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాది తర్వాత విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఈ నెల 26న ఉదయం సుమారు 10:30 గంటలకు అదే కంపెనీలో పనిచేసే స్నేహితుడు రాజిరెడ్డి ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో అనుమానంతో ఆమె నివాసానికి వెళ్లి చూడగా, ఆమె మృతిచెందినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు, మియాపూర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల పరిశీలనలో సూసైడ్ నోట్ లభించింది. అందులో గత నాలుగు నెలలుగా ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు, ఆ పరిస్థితుల నుంచి బయటపడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.